Friday, March 28, 2014

వెంకటేశ్వర్లు గాడి గోల 1: "భయపడు..అస్సలు తప్పులేదు"

అబ్బబ్బా .. రోజురోజుకీ మా వెంకటేశ్వర్లు గాడి చాదస్తం ఎక్కువైపోతుందండి. 
అరే.. పట్టుమని పాతికేళ్ళు లేవు గాని, అరవైయేళ్ళ ముసలాడి చాదస్తం వీడూను...హు.. 
కానీ నిజం చెప్పాలంటే వాడి మాటలు చాలా లోతుగా ఉంటాయి..విన్నవెంటనే కోపం వచ్చినా, 
ఆలోచించి చూస్తే అర్ధం తెలుస్తుంది.. ఏం లేదండీ నిన్న మా ఇద్దరికీ చిన్న డిస్కషన్ ( చెప్పాలంటే డిస్కషన్ 
కాదులేండి, వాడు చెప్పాడు..నేను విన్నాను ) జరిగింది. మీరే చూడండి ఏం అంటున్నాడో:

నేను                   :  నువ్వు ఎన్నైనా చెప్పరా, మన తెలుగు సినిమాలే సినిమాలు .. అరే,..ఒక్క డైలాగ్ చాలు,
                             నరనరాల్లో ధైర్యం నింపడానికి. ఏమంటావ్?
వెంకటేశ్వర్లు        :   ముందు ఆ డైలాగ్ ఏంటో చెప్పమంట.
నేను                  :   నిన్న నేను, శీను గాడు కలిసి " *** " సినిమాకి వెళ్ళాం కదా!.. మన హీరో " *** " విలన్ తో
                             చెప్పే డైలాగ్ వుంది చూడు .. కేకంతే... " భయమంటే తెలియని బ్లడ్డురా నాది " .. అబ్బబ్బబా
                             సూపరో సూపరు .. ఏమంటావ్ ?

నన్ను కింద నుండి పైకి ఒకసారి చూశాడు .. ఆ చూపు నాకు అలవాటేలెండి.

వెంకటేశ్వర్లు        :   నీకు అంత ధైర్యం వచ్చేడానికి ఏముందిరా ఇందులో ??
నేను                   :   అరే .. మనం కూడా హీరోలాగే భయపడకుండా అన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలి .. అస్సలు దేనికీ
                              భయపడకూడదు.. ఈ మాత్రం కూడా అర్ధం కాలేదా నీకు ??
వెంకటేశ్వర్లు        :    ఏడిసావ్...భయమంటే ఏమిటో తెలియకపోతే, ఆ భయాన్ని ఎలా జయిస్తావురా!!
                              శత్రువు ఎవరో తెలియకుండా ఎవరితో పోరాడతావ్!!
                              భయమంటే ఏమిటో తెలియకపోవడం ధైర్యం కాదురా, భయాన్ని పూర్తిగా తెలుసుకుని,
                              అంతే పూర్తిగా దాన్ని పెకలించి వేయడమే నిజమైన ధైర్యం అంటే.
నేను                  :    ఒక్క ముక్క అర్దంకాలేదు!!
వెంకటేశ్వర్లు        :    భయపడు...అందులో ఏమాత్రం తప్పులేదు. పదిరోజులు భయపడు, అప్పుడు ఆ భయాన్ని
                               గురించి పూర్తిగా తెలుసుకుంటావ్. పదకొండో రోజు దానితో పోరాడు, శత్రువు ఎలాంటివాడో
                               తెలిస్తే ఇంకేముంది, యుద్ధంలో ఖచ్చితంగా గెలుస్తావ్ కదా!!
నేను                  :   మరి???
వెంకటేశ్వర్లు        :   జీవితాంతం భయపడుతూనే వుంటే??, అనే ప్రశ్న అడిగేవాళ్ళకి సమాధానమిచ్చే
                              ధైర్యం మాత్రం నాకు లేదు.

అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు .. ఏంటో!! ఈ వెంకటేశ్వర్లు గాడు!!.. అస్సలు అర్ధం కాడు??!!


                         

  

Monday, March 17, 2014

నా కథలు 1: " బి'ఛీ'నెస్ "

పది అంతస్తుల మేడ - వాడి ఆఫీసు.
ఒక మహారాజప్యాలెస్ లాగా ఉంది - వాడి రూమ్.
నేను వింటున్నాను - వాడు మాట్లాడుతున్నాడు.

వాడు :   "అదిగో..అక్కడ కూర్చుని బుద్ధిగా పనిచేసుకుంటూ వున్నాడే"

అటువైపు చూసాను. అక్కడొక వ్యక్తి. అంతా బాగానే వున్నాడు కానీ, అతని ముఖంలో ఏదో కోల్పోయిన
ఫీలింగ్ కనపడుతుంది.

వాడు :  " అతని పేరు ఆనంద్ - Engineering + MBA - చాలా చురుకైనవాడు.
              అందుకే కాలేజ్ పట్టా చేతికి రాగానే, నా వ్యాపారానికి పోటీ వచ్చాడు.
              అతని దగ్గరవున్న పెట్టుబడి అంతా కలిపి, మొదటిసారి 1000 టన్నుల ప్రొడక్ట్ని
              మార్కెట్లో దింపాడు. ఆశ్చర్యం..అద్భుతం. నెల రోజుల్లోనే మొత్తం ప్రొడక్ట్ సేల్
              అయిపోయింది. అప్పట్లో మీ పేపర్ వాళ్ళంతా తనని ఆకాశానికి ఎత్తేసారు.
              ' యువ Entrepreneur హవా' అని.. అంతే ఉత్సాహంతో రెండోసారి, తనకి తెలిసిన
              వాళ్ళ దగ్గర అప్పుచేసిమరీ 2000 టన్నుల ప్రొడక్ట్ని మార్కెట్లోకి దించాడు. అద్భుతం
              20 రోజులకే జరిగింది. ప్రోడక్ట్ అంతా మార్కెట్లో క్లియర్ సేల్. నాకు బాగా గుర్తు,
              అప్పట్లో ఆనంద్ అమెరికాలో జరిగిన ఒక conferenceలో తన విజయయాత్ర గురించి
              బాగా మాట్లాడాడని మీ పేపర్లో ఇంకాబాగా వ్రాశారు...హు...ముచ్చటగా మూడోసారి,
              ఈసారి తనకి తెలియని వాళ్ళదగ్గర నుండి కూడా అప్పుతీసుకుని, ఏకంగా 10,000
              టన్నుల ప్రొడక్ట్ని దించేసాడు. ఆరు నెలలైనా అద్భుతం మాత్రం జరగలేదు. 10,000
              టన్నుల ప్రొడక్ట్, 10 టన్నులైనా అమ్ముడవ్వలేదు. తీసుకున్న అప్పుకి వడ్డీ మాత్రం
              కొండంత అయ్యింది. మరో ఆరు నెలలకి ఆనంద్ ని పిలిచి నా కంపెనీలో Manager Post
              ఇచ్చాను. కళ్ళకద్దుకుని జాయిన్ అయ్యాడు. అతని 10,000 టన్నుల సరుకుని నేనే
              కొన్నాను. అతను నన్ను దేవుడనుకున్నాడు. "

జేబులో నుండి ఒక ఖరీదైన సిగరెట్ తీసి ముట్టించాడు. నా అంచనా ప్రకారం ఆ సిగరెట్ ఖరీదు
నా నెల జీతంతో సమానం. వాడు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు.

వాడు :  " ఇది అందరికీ తెలిసిన కథ. ఎవ్వరికీ తెలియని కథ, చివరికి ఆనంద్ కి కూడా.. అదేంటంటే,
              అతను మొదటిసారిగా మార్కెట్లో పెట్టిన 1000 టన్నుల్నీ..రెండోసారి పెట్టిన 2000 టన్నుల్నీ
              కూడా కొనింది నేనే "

నా చేతిలోవున్న పెన్ కిందపడిపోయింది. వాడు వదులుతున్న పొగలో ఆనంద్ ముఖం కనపడుతుంది.

Sunday, March 9, 2014

నా డైలాగ్స్ 3: " ధూమ్ 3 " మూవీ నుండి


హిందీ:
Bande hain hum uske, hum pe kiska zor 
umeedo ke suraj, nikle chaaron aurr 
iraade hai fauladi, himmati har kadam 
apne haatho kismat likhne, aaj chale hain hum

ఇంగ్లీష్:
I am God's man, who could dare to defy me
The Sun of hopes, is out in all directions 
My intentions are solid, and there is courage in every step
I have set forth today, to write my own destiny

తెలుగు:
దేవుని మనిషిని నేను..నన్నెవరు ఆపగలరు??
ఆ సూర్యుని ఆశాకిరణాలు..నలుదిక్కులకు విస్తరిస్తున్నాయి
నా గమ్యం చాలా ధ్రుడమైనది..నేవేసే ప్రతిఅడుగులో ధైర్యం ఉంది
ఈ రోజే నిశ్చయించాను..నా భవిషతున్ని నేనే రాసుకుంటాను





నా డైలాగ్స్ 2: " ఆషీకీ 2" మూవీ నుండి ఒక అద్భుతమైన డైలాగ్


" హిందీ " లో
Duniya ke sabse behtareen aur mashoor kalakar woh log hote hai jinki apni ek ada hoti hai,.. woh ada joh kisi ki nakal karne se nahi aati,.. woh ada joh unke saath janam leti hai. 

" ఇంగ్లీష్ " లో 
The best and famous performers of this world are those people who have their own style ... the style that doesn't come by imitating others ... the style that is born with them. 

" తెలుగు " లో 
ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరికీ వారిదంటూ ఒక style ఉంటుంది. 
ఆ స్టైల్ అనేది ఎవరినో అనుకరించడం ద్వారా వచ్చిందికాదు..ఆ స్టైల్ అనేది వారితోపాటే పుడుతుంది. 

Saturday, March 8, 2014

నా పుస్తకాలు 1: "ఆల్కెమిస్ట్" పుస్తకం నుండి

నువ్వు  దేన్నైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే..
ఈ ప్రపంచం అంతా ఏకం అయ్యి.. నువ్వు కోరుకున్నదాన్ని నీ దగ్గరకు తెస్తుంది

నా డైలాగ్స్ 1: "ఫనా" హిందీ మూవీ నుండి

ప్రియా..నన్ను వదిలి దూరంగా ఎలా వెళ్ళగలవ్ ??
నీ హృదయం నన్ను మర్చిపోగలదా??
నీవు తీసుకునే శ్వాసలో ఉండే గాలిని నేను
నేను లేకుండా  నువ్వు ఎలా జీవించగలవ్??