Friday, March 28, 2014

వెంకటేశ్వర్లు గాడి గోల 1: "భయపడు..అస్సలు తప్పులేదు"

అబ్బబ్బా .. రోజురోజుకీ మా వెంకటేశ్వర్లు గాడి చాదస్తం ఎక్కువైపోతుందండి. 
అరే.. పట్టుమని పాతికేళ్ళు లేవు గాని, అరవైయేళ్ళ ముసలాడి చాదస్తం వీడూను...హు.. 
కానీ నిజం చెప్పాలంటే వాడి మాటలు చాలా లోతుగా ఉంటాయి..విన్నవెంటనే కోపం వచ్చినా, 
ఆలోచించి చూస్తే అర్ధం తెలుస్తుంది.. ఏం లేదండీ నిన్న మా ఇద్దరికీ చిన్న డిస్కషన్ ( చెప్పాలంటే డిస్కషన్ 
కాదులేండి, వాడు చెప్పాడు..నేను విన్నాను ) జరిగింది. మీరే చూడండి ఏం అంటున్నాడో:

నేను                   :  నువ్వు ఎన్నైనా చెప్పరా, మన తెలుగు సినిమాలే సినిమాలు .. అరే,..ఒక్క డైలాగ్ చాలు,
                             నరనరాల్లో ధైర్యం నింపడానికి. ఏమంటావ్?
వెంకటేశ్వర్లు        :   ముందు ఆ డైలాగ్ ఏంటో చెప్పమంట.
నేను                  :   నిన్న నేను, శీను గాడు కలిసి " *** " సినిమాకి వెళ్ళాం కదా!.. మన హీరో " *** " విలన్ తో
                             చెప్పే డైలాగ్ వుంది చూడు .. కేకంతే... " భయమంటే తెలియని బ్లడ్డురా నాది " .. అబ్బబ్బబా
                             సూపరో సూపరు .. ఏమంటావ్ ?

నన్ను కింద నుండి పైకి ఒకసారి చూశాడు .. ఆ చూపు నాకు అలవాటేలెండి.

వెంకటేశ్వర్లు        :   నీకు అంత ధైర్యం వచ్చేడానికి ఏముందిరా ఇందులో ??
నేను                   :   అరే .. మనం కూడా హీరోలాగే భయపడకుండా అన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలి .. అస్సలు దేనికీ
                              భయపడకూడదు.. ఈ మాత్రం కూడా అర్ధం కాలేదా నీకు ??
వెంకటేశ్వర్లు        :    ఏడిసావ్...భయమంటే ఏమిటో తెలియకపోతే, ఆ భయాన్ని ఎలా జయిస్తావురా!!
                              శత్రువు ఎవరో తెలియకుండా ఎవరితో పోరాడతావ్!!
                              భయమంటే ఏమిటో తెలియకపోవడం ధైర్యం కాదురా, భయాన్ని పూర్తిగా తెలుసుకుని,
                              అంతే పూర్తిగా దాన్ని పెకలించి వేయడమే నిజమైన ధైర్యం అంటే.
నేను                  :    ఒక్క ముక్క అర్దంకాలేదు!!
వెంకటేశ్వర్లు        :    భయపడు...అందులో ఏమాత్రం తప్పులేదు. పదిరోజులు భయపడు, అప్పుడు ఆ భయాన్ని
                               గురించి పూర్తిగా తెలుసుకుంటావ్. పదకొండో రోజు దానితో పోరాడు, శత్రువు ఎలాంటివాడో
                               తెలిస్తే ఇంకేముంది, యుద్ధంలో ఖచ్చితంగా గెలుస్తావ్ కదా!!
నేను                  :   మరి???
వెంకటేశ్వర్లు        :   జీవితాంతం భయపడుతూనే వుంటే??, అనే ప్రశ్న అడిగేవాళ్ళకి సమాధానమిచ్చే
                              ధైర్యం మాత్రం నాకు లేదు.

అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు .. ఏంటో!! ఈ వెంకటేశ్వర్లు గాడు!!.. అస్సలు అర్ధం కాడు??!!


                         

  

No comments:

Post a Comment